హైదరాబాద్`నవభూమిబ్యూరో: ప్రముఖ కమెడియన్,మాజీ మంత్రి బాబూమోహన్ తిరిగి టీడీపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీలో చేరాలనుకుంటున్న తన అభిలాషను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడిని కలిసి వెల్లడిరచారు. ఆదివారంనాడు హైదరాబాద్‌లోని చంద్రబాబునాయుడు స్వగృహంలో ఆయన్ను కలిసిన బాబూమోహన్ ఏకాంతంగా కొద్దిసేపు మాట్లాడినట్లు వినిపిస్తోంది.ఈ సందర్భంగా తన మనోభావాలను చంద్రబాబుతో పంచుకున్నారు.
బాబూమోహన్‌కు తొలుత చంద్రబాబే పిలిచి టికెట్టు ఇచ్చారు. తొలిసారిగా టీడీపీలో చేరిన బాబూమోహన్ అందోల్ నుంచి పోటీ చేసి,ఎమ్మెల్యేగా కొన్నాళ్లు మంత్రిగా వ్యవహరించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరిపోయారు. ఆందోల్ టికెట్టు ఇవ్వకపోవడంతో బాబూమోహన్ బీజేపీ టిక్కెట్టుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయ వైరాగ్యంలో ఉన్న ఆయన ఏపీలో టీడీపీ గెలవడంతో తెలంగాణ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబునాయుడు బాబూమోహన్ చేరికపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.
సైకిలెక్కనున్న బాబూమోహన్?
RELATED ARTICLES