జగన్‌కు అనుకూలంగా ఉన్న అధికారుల్లో కలవరం
అమరావతి`నవభూమిబ్యూరో: గత ప్రభుత్వంలో సీఎం జగన్‌కు అనుకూలంగా ఉన్న అధికారుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే చంద్రబాబుతో సహా ముఖ్యనేతలపై తప్పుడు కేసుల నమోదు చేసిన అత్యంత వివాదాస్పద అధికారి,సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై అమెరికా వెళ్లనున్నారు. దీని కోసం సీఎస్‌కు దరఖాస్తు చేసుకోగా ఆయన వెంటనే అనుమతించారు
అలాగే టీటీడీ ఛైర్మన్ భూమన్ కరుణాకర్‌రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇక సీఎస్‌ను మార్చే అవకాశాలున్నాయి. సీఎస్ జవహర్ కూడా జగన్‌కు అనుకూలంగా వ్యవహరించి పలు వివాదాలకు కారణమయ్యారనే విమర్శలున్నాయి. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ పేరును పరిశీలిస్తున్నారు.
కొడాలి నాని ఓటమిని భరించలేక వలంటీర్ ఆత్మహత్య
గుడివాడ`నవభూమిప్రతినిధి: గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే,మాజీ మంత్రి కొడాలి నాని పరాజయం పాలవ్వడంతో సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ అనే వలంటీర్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
దిల్లీకి చంద్రబాబు,పవన్‌కళ్యాణ్
అమరావతి`నవభూమిప్రతినిధి: ఏపీ ఎన్నికల్లో గెలిచిన ఊపులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్ దిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకుంటారు. అయితే సాయంత్రం ఎన్డీఏ సమావేశం మోదీ అధ్యక్షత జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్ పాల్గొనడమే కాకుండా బీజేపీ ముఖ్యనేతలను కలిసి, ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని కోరనున్నారు. అలాగే మంత్రివర్గ కూర్పుపై కూడా చర్చించనున్నారు.
చంద్రబాబు ఎన్డీఏలో చక్రం తిప్పనున్నారా?
అమరావతి`నవభూమిప్రతినిధి: ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబునాయుడికి ఆహ్వానం అందింది. అయితే మేజిక్ సంఖ్య వచ్చినప్పటికీ మిత్రుల సహకారంతోనే మోదీ గద్దె ఎక్కనున్నారు. అయితే మిత్రుల సహకారం కావాలంటే, మధ్యలోనే ఎలాంటి గండం రాకుండా ఉండాలంటే చంద్రబాబు,నితీశ్‌లాంటి మిత్రులు ఇప్పుడు మోదీకి అత్యంత అవసరం. అందుకే ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు పెద్ద పీఠ వేయబోతున్నారని వినికిడి. అంతేకాక ఎన్డీఏ కన్వీనర్‌గా కూడా పదవిని కట్టబెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వరంగల్,ఖమ్మం,నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
వరంగల్`నవభూమిబ్యూరో: వరంగల్,ఖమ్మం,నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్ననానికి ఫలితం వెల్లడి కానుంది. ఈ ఓట్ల లెక్కింపులో 96 టేబుళ్లపై 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న,బీఆర్‌ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి,బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా గెలిచారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడటంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.