హైదరాబాద్`నవభూమిబ్యూరో
త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరగబోతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత విస్తరణకు అధిష్టానం ముహుర్తం పెట్టినట్లుగా వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక ఆ పిమ్మట స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే మంత్రివర్గంలో అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఉండాలి. ఉన్న జిల్లాల్లో రెండు మూడు మంత్రి పదవులుంటే కొన్ని జిల్లాలకు మంత్రులే లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్,నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి ఛాన్స్ లభించవచ్చు. ఇక మైనార్టీకి ప్రాతినిధ్యం లేదు. అలాగే మాదిగ వర్గం నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ కమ్యూనిటీకి కూడా అవకాశముందని వినిపిస్తోంది.
ఈ మంత్రి వర్గ విస్తరణలో ఆరుగురికి ఛాన్స్ దక్కే అవకాశముంది. ఈ విస్తరణలో బెర్త్‌లు దక్కించుకునే వారిలో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.అందులో రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్‌మోహన్‌రెడ్డి,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి,ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్ లేదా వివేక్,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్లు వినిపిస్తున్నాయి.
త్వరలో మంత్రివర్గ విస్తరణ
RELATED ARTICLES