హైదరాబాద్ 29, మే నవభూమి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని తద్వారా జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచ్లుగా అవకాశం కల్పించినట్లు అవుతుందని ఇటువంటి సదవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి పరుచుకుని బీసీ సమాజాన్ని చేరదీయాలని, జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భయ్యా వెంకట నరసింహారాజ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సిద్ధించి 70 ఏళ్ల గడిచిపోయిన రాజ్యాధికారంలో బీసీలకు సమాన వాటా దక్కకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బిసి చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు పి రమణ మాట్లాడుతూ బీసీల వెనుకబాటుతనానికి గత పాలకులే కారకులని మండిపడ్డారు. ఇకనైనా బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి వారి హక్కుల సాధన కొరకు నిరంతరం పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. రాష్ట్రంలో దేశంలో బీసీ జనాభా అత్యధికంగా ఉందని అటువంటి సమాజం రాజ్యాధికారానికి దూరం చేయబడిందని ఎంతోమంది త్యాగదనుల పోరాట ఫలితంగా స్వాతంత్రం అయితే సాధించుకున్నాం కానీ పౌర హక్కుల సమతుల్యతలో లోపం సుస్పష్టమని ఇటువంటి లోపాలను సరి చేయడానికి, బీసీల హక్కుల సాధనకు జాతీయ బిసి చైతన్య సమితి నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు. అనంతరం జాతీయ అధ్యక్షులు పి రమణ, ఇదే వేదికనుండి
రాష్ట్ర అధ్యక్షులుగా భయ్యా వెంకట నరసింహారాజ్ , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఎలిగేటి కృష్ణవేణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వినుకొండ సంధ్య లను నియమిస్తున్నట్లు మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. ఈ వేదిక బిసి సమస్యలపై పోరాడటానికి సంసిద్ధంగా ఉన్నదని సమాంతర భావజాలం ఉన్నవారితో కలిసి పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన వివరించారు. గాంధీజీ చెప్పినట్లు సమ సమాజం కావాలి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి ఒక్కరూ తోటి పౌరులతో సమాన ఆర్థిక స్వాతంత్రాన్ని అనుభవించగలగాలి, సామాజిక విడగొట్టబడిన సమాజం ఐక్యతతో ముందుకు సాగాలని, చికగలు సర్వర్ మత సమయంలో వివేకానందుడు చెప్పినట్లు భారతీయులంతా సోద ర సోదరీమణుల్లా కులమత ప్రాంత భేదాలకు అతీతంగా కలిసి జీవించాలని మాదే తరం కానీ జీవన రేఖ ఈ భరత గడ్డ అని సోలార్ సైంటిస్ట్. డాక్టర్ రమేష్ కల్లూరి తెలియజేశారు ఈ సమావేశంలో యువ నాయకులు చలపతి సుమంతా చారి హాజరయ్యారు.