ఇసుకాసురుల ఆగడాలపై ములుగు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయాయి. అధికారుల హడావుడి మూడ్నాళ్ళ ముచ్చటగా ముగియడంతో బినామీ కాంట్రాక్టర్లు మళ్ళీ చెలరేగిపోతున్నారు. యధేచ్చగా అక్రమాలకు ద్వారాలు తెరిచారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను పూర్తిగా బేఖాతర్ చేస్తూ టీఎస్ఎండీసీ అధికారులు కాంట్రాక్టర్లకు పూర్తిగా సహకరిస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన కింది స్థాయి అధికారులు కూడా కాంట్రాక్టర్ల అడుగులకు మడుగులొత్తుతున్నారు. పైగా కలెక్టర్ తనిఖిలు చేయమంటు ఇసుక క్వారీలో పంపిన అడవుడి చేసిన మైనింగ్. Tsmdc అధికారులు, రెవిన్యూ అధికారులు అటు వైపు చూడడమే మరిచిపోయారు.
నిబంధనల ప్రకారం ఇసుక రీచ్ లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనితో అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. అదనపు కలెక్టర్ స్థాయి నుంచి వీఆర్వో స్థాయి వరకూ అందరికి ఆదేశాల జరిచేసిన.. నిబంధనల ప్రకారం రీచ్ లను నిర్వహిస్తామని ఆదివాసీ సహకార సంఘాలకు చూపిన. రీచ్ ల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటు చేయాలనీ పేసా చట్టం చెపుతున్న. ఇష్టం వచ్చిన రీతిలో ట్రిపర్స్ పెట్టి తొలకలు జరుపుతున్నారు.కలెక్టర్ ఆదేశాలను హడావుడి చూసిన ఏజెన్సీ వాసులు కలెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఇదంతా తాత్కాలికమేనని తేలిపోయింది.
సహకార సంఘాలు డమ్మీలుగా మారగా కాంట్రాక్టర్లదే హవా నడుస్తోంది. టీఎస్ఎండీసీ ఉద్యోగులు కూడా ఓవర్ లోడింగ్ బకెట్ల డబ్బుకు, కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు లొంగి పోయి వ్యవహారాలన్నీ వారికి అప్పగిస్తున్నారు. బినామీ కాంట్రాక్టు ఒప్పందాలపై జిల్లా కలెక్టర్ ఏనాడూ విచారణ జరిపించలేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక రీచ్ ల నిర్వహణకు విధివిధానాలను రూపొందించే అధికారం కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తున్న జిల్లా ఇసుక కమిటీలకు ఉన్నది.
వందల సంఖ్యలో టిప్పర్లను తీసుకువచ్చి పగలు, రాత్రి తేడా లేకుండా డంపింగ్ చేస్తున్నారు. మార్చిలో ఒక బకెట్ కూధడా వేయడానికి భయపడిన కాంట్రాక్టర్లు ఇప్పడు మూడు నాలుగు బకెట్లు ఓవర్ లోడింగ్ చేసి ప్రతి లారీకి అదనంగా మూడు వేల నుండి నుంచి ఐదు వేల వరకూ వసూలు చేస్తున్నారు. తహసిల్దార్లు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇప్పుడు కాంట్రాక్టర్లకు జీ హుజూర్ అంటున్నారు.
సీసీ కెమేరాలను పట్టించుకున్న నాధుడే లేడు.
లోడింగ్ చార్జీల పేరుతో ప్రతి లారీకి రూ.3500 నుంచి రూ. 5000 అదనంగా వసూలు చేస్తున్నారు. వాజేడు మండలంలోని ఇసుక రీచ్ లు దగ్గరగా ఉండడంతో రాంపురం , ధర్మారం, అయ్యవారిపేట ఇసుక రీచ్ లకు లారీలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ రీచ్ లకే టీఎస్ఎండీసీ అధికారులు అధిక క్వాంటిటీలు పెట్టడంతో దూరంలో ఉన్న వెంకటాపురం మండలంలోని రీచ్ లకు లారీలు రావడం లేదు. వాజేడు మండల కాంట్రాక్టర్లపై టీఎస్ఎండీసీ అధికారులు అవ్యాజమైన ప్రేమ చూపించడం వెనుక ఏటూరునాగారం లోని ఆ సంస్థ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓవర్ లోడింగ్, టిప్పర్లతో రవాణా వంటి విషయాల్లో టీఎస్ఎండీసీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులందినా అధికారులు పట్టించు కోరు. ఆదివాసీ సంఘాలు ఇటీవల లారీలను నిలిపి వేసి తూకం వేయించడంతో 20 టన్నులు అదనపు లోడ్ వేసినట్టు నిరూపణ అయింది. ఈ విషయాన్ని సంబంధిత పీవో దృష్టికి తీసుకు వెళ్ళినా ఆయన చర్యలు తీసుకోలేదు. పైగా కాంట్రాక్టర్లనే సమర్ధించడంతో దాని వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రచారం జరుగుతుంది.
ఓవర్‌లోడ్‌తో ఖజానాకు గండి
వాజేడు మండలంలో పరిధిలో 3 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. లక్షలు క్యూబిక్ మీటర్ల ఇసుక మాయం అయిపొయింది. వర్షా కాలం మూడు నెలలు మినహాయిస్తే 9 నెలలపాటు లారీలు ఇసుకను తరలిస్తుంటాయి. ఇసుక రీచ్‌కు వెళ్లే వాహనానికి తెలంగాణ స్టేట్ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(టీఎ్‌సఎండీసీ) జారీ చేసే వే బిల్ తప్పనిసరి. రీచ్ కాంట్రాక్టర్ సైతం అందులో పేర్కొన్న విధంగా ఇసుకను కేటాయించాలి. 12 టైర్ల లారీలో 25 టన్నులు, 14 టైర్లకు 32 టన్నులు, 16 టైర్లకు 35 టన్నుల ఇసుక నింపాల్సి ఉండగా… ఓవర్‌లోడ్ సాధారణమైపోయింది. వేబిల్‌లో పేర్కొన్న మేరకు టన్నుకు రూ.470 చొప్పున ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అనుమతికి మించి నింపితే టన్నుకు రూ.600-700 వసూలు చేస్తున్నారు. ఇందులో ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు జమ కాదు. ఒక లారీకి ఐదు టన్నుల ఇసుకను అదనంగా వేసినా రూ.3500 నుండి 5000 వరకు కాంట్రాక్టర్ జేబులోకే వెళ్తుంది. ఒక రోజులో సరాసరిగా 150 నుండి 200 వాహనాల చొప్పున ఓవర్‌లోడ్ వల్ల వచ్చే అక్రమ సంపాదన రూ.3లక్షలపైనే. అక్రమంగా దండుకుంటున్నారు. ఇలా ఒక ఇసుక రీచ్ పరిధిలోనే రోజుకు రూ.2లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.
చర్యలకు వెనుకడుగు
ఇసుక అక్రమ వ్యాపారానికి రీచ్‌లే అడ్డాలు. వేబిల్ లేకుండా ఇసుక అమ్ముకోవడం, పరిమితికి మించి లోడ్ చేయడం వంటి అక్రమాల వెనుక కీలకపాత్ర రీచ్ కాంట్రాక్టర్లదే. నిబంధనలు పాటించని ఇసుక లారీ పట్టుబడితే సంబంధిత రీచ్‌లూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొదటిసారి భారీ జరిమానా విధించి రెండోసారి రీచ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసే అధికారం టీఎ్సఎండీసీకి ఉంది. కానీ అధికారులు కనీసం రీచ్‌లకు వెళ్లి తనిఖీలు చేయలేకపోతున్నారంటే.. వారి మీద ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. రీచ్‌లలో అక్రమాలు గుర్తించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని, వాహనాల రూట్ చేంజ్‌ను గుర్తించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నామని అధికారులు చెప్పే మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి.
ఇసుక మేత
ఇసుక అక్రమాలు అడ్డుకోవడం, నిబంధనలను పక్కాగా అమలుచేసే బాధ్యత ఐదు ప్రభుత్వ శాఖలపై ఉంది. స్థానికంగా రీచ్‌ల వద్ద అక్రమాలు, అనుమతులు, రూట్, ఓవర్ లోడ్ వంటి ఉల్లంఘనలపై టీఎ్‌సఎండీసీ, మైనింగ్, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ అక్రమాలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది రాత్రి పగలు భారీ యంత్రలతో ఇసుక తోలుతున్న దాడులు చేసిన దాఖానాలు లెవ్వు..భారీ వాహనాలతో రోడ్లు ఛిద్రమవుతున్నాయంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాల వెనుక ప్రమేయం ఎవరిదీ ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అభయం లేని అరణ్యం
పర్యావరణం
పర్యావరణం, జీవావరణం ఎవరికీ పట్టని పదాలుగా మారిపోయాయి. మానవాళి మనుగడకు అవసరమైన అడవులను,ప్రకృతి సమతుల్యంలో కీలకమైన వన్యప్రాణులను కాపాడుకోవాలనే శ్రద్ధ ఇటు పాలకులకు కానీ అటు ప్రజలకు కానీ పట్టదు. అది కేవలం పర్యావరణ వాదులు, ప్రకృతి ప్రేమికులకు సంబంధించిన విషయంగా మారిపోవడం విశేషం. రాష్ట్రంలోని ఏటూరునాగారం అభయారణ్యం పరిస్థితి చూస్తే ఇది అక్షర సత్యమనిపిస్తుంది. దేశం లోని పురాతనమైన అభయారణ్యాల్లో ఏటూరునాగారం కూడా ఒకటి. 2017 జులై 27 న ఎస్ఓ నంబర్ 2046 (ఇ) ద్వారా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ తో ఈ అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి వచ్చింది. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇసుక లారీలతో వన్యప్రాణులు చెల్లా చెదురు..
ఎకో సెన్సిటివ్ జోన్, వన్యప్రాణుల అభయారణ్యం మధ్య నుంచి వేసిన్ రోడ్ ను163 జాతీయ రహదారిగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్ చత్తీస్ గఢ్ మధ్య వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటికి తోడు వందలాది ఇసుక లారీలు ఈ రహదారి మీదుగానే ప్రయాణం చేస్తున్నాయి. వాజేడు, వెంకటాపురం ప్రాంతం నుంచి భద్రాచలం వైపు, ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల నుంచి మణుగూరు మీదుగా పాల్వంచ వైపు రహదారులు ఉన్నా మణుగూరు, చర్ల ప్రాంతాల నుంచి వచ్చే ఇసుక లారీలను కూడా ఏటూరునాగారం అభయారణ్యం మీదుగా తరలిస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న లారీలపై ఎటువంటి నియంత్రణ లేక పోవడంతో హారన్ ల శబ్థాలకు వన్యప్రాణులు చెల్లా చెదురై పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో లారీల కింద పడి చనిపోతున్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ లో ఇసుక తవ్వకాలను అనుమతి ఉంట్టుందా. అడవి శాఖ అధికారులు పర్మిషన్ ఇవ్వొచ్చా అనేది ప్రజలలో అనుమానాలు తేలేతుత్తున్నాయి.