Site icon Navabhoomi Telugu News

రాత పరీక్ష లేదు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ.. ఈ ఉద్యోగ సమాచారం మీకోసం..

Kendriya Vidyalaya Jobs |ప్రయివేట్ ఉద్యోగాలంటే సరే.. నైపుణ్య పరీక్ష.. ఇంటర్వ్యూలో ఓకే అయితే ఉద్యోగం గ్యారంటీ.. కాని ప్రభుత్వ రంగ లేదా అనుబంధ సంస్థల్లో రెగ్యులర్‌ లేదా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం రావాలన్నా కొన్నిసార్లు రాత పరీక్ష రాయాల్సిందే. రాత పరీక్షలో ఉత్తీర్ణులైతే ఆ తర్వాత.. ఇంటర్వ్యూలకు పిలుస్తారు. చాలామంది రాత పరీక్ష అంటే చాలు భయపడిపోతూ ఉంటారు. రాసినా రాదులే అనే ఉద్దేశంతో ఉంటారు. అయితే హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయంలో పలు టీచింగ్, నాన్‌ టీచింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎలాంటి విద్యార్హతలు ఉండాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం.

ఉద్యోగ ఖాళీలు, అర్హతలు : ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కోచ్‌, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, హిందీ, సైన్స్‌, కామర్స్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌, హాకీ/ అథ్లెటిక్స్‌, యోగా విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బీఈడీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్థులు కచ్చితంగా సీటెట్‌ అర్హత సాధించి ఉండాలి.

అభ్యర్థుల వయసు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలను కేంద్రీయ విద్యాలయ, ఉప్పల్‌, హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,250 నుంచి రూ. 27,500 వరకు జీతం చెల్లిస్తారు.

ఇంటర్వ్యూలను మార్చి 07వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 8గంటల 30 నిమిషాల నుంచి నిర్వహిస్తారు.

Exit mobile version