Site icon Navabhoomi Telugu News

Love: ప్రేమలో ఫెయిల్యూర్‌ ఉంటుందా.. లవ్‌ అంటే అదొక్కటేనా..

Love: ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలీదు కాని.. ఒకే ఒక్క డైలాగ్‌ లాస్ట్‌ ఇయర్‌ అంతా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌ అయింది. ఇప్పటికి ఆ డైలాగ్‌ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అదేనండి.. బంగారం డైలాగ్‌.. బంగారం ఒకటి చెప్పనా.. చెట్టుకు నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది.. అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా ప్రేమ విలువ నీకు తెలిసేది.. ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయిపోయింది. ఈ ఒకే ఒక్క డైలాగ్‌ ప్రేమ యొక్క గొప్పతనాన్ని.. లవ్‌ సక్సెస్‌ అవ్వాలంటే ఆ ప్రేమ ఎలా ఉండాలనే సంకేతాన్ని ఇచ్చి ఉండొచ్చు.. అయితే ప్రేమ అనే రెండు అక్షరాలు ప్రతి ఒక్కరి జీవితంలో తియ్యని జ్ఞాపకం. ప్రేమ ఎలా పుడుతుందో.. ఎప్పుడు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం అసలు ప్రేమ అంటే ఓ అబ్బాయి.. అమ్మాయి మధ్య ఉండేదే అని ఎక్కువమంది భావిస్తారు. కాని ప్రేమ అనే రెండే రెండు అక్షరాలు.. అబ్బాయి.. అమ్మాయి మధ్య ప్రేమకు మాత్రమే పరిమితం కాదు.. ప్రేమ అనేది కుటుబం సభ్యులపై కావచ్చు.. స్నేహితులపై కావచ్చు.. లేదా కొంతమంది కొన్ని ప్రదేశాలను, వస్తువులను, ఆహార పదార్థాలను ప్రేమిస్తూ ఉంటారు.

ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమ అనేది ఉంటుంది. ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడే ఆ ప్రేమ బలంగా ఉంటుంది. ప్రేమలో అతి పనికిరాదు.. అది ఎవరిపై అయినా.. అతి ఉంటే ఆ ప్రేమ స్వచ్ఛమైనదా కాదా అనే అనుమానం తలెత్తే అవకాశం లేకపోలేదు. ప్రేమలో నిజాయితీ ఉంటే అది ఏళ్ల తరబడి బలంగా ఉంటుంది. జీవితాంతం కావల్సిన ప్రేమను పంచుతుంది. చెట్టుకు లేదా మొక్కలకు నీళ్లు పోస్తేనే కాయలు, పండ్లు, పువ్వులు పూస్తాయనేది ఎంత వాస్తవం. అయితే జీవితంలో ప్రేమ కూడా నీరు లాంటిదనే చెప్పుకోవాలి. ప్రేమ ఉన్నప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది.. ఓ రకంగా చెప్పాలంటే పువ్వులా విరబూస్తుంది. పువ్వు రాలిపోతుంది కదా అనుకోవచ్చు.. కానీ చెట్టు బతుకుతుంది.

మరెన్నో పువ్వులను, కాయలను, పండ్లను మనకు అందిస్తుంది. అందుకే ప్రేమ నీరు లాంటిదని చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రేమ ఆక్సిజన్‌.. కూడా ప్రేమ ఓ బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌గానూ చెప్పుకోవచ్చు. ప్రేమ లేకుంటే జీవితం లేదని అనుకోవడం కాదు కానీ.. జీవితంలో ప్రేమ ఉంటే.. ప్రేమించిన అంటే మనకు ఇష్టమన వ్యక్తి మనతో ఉంటే ఆ లైఫ్‌ బాగుంటుంది.. ఎంజాయ్ చెయ్యొచ్చు. కష్టాలన్ని ఇట్టే మర్చిపోవచ్చు. ప్రేమ యొక్క రుచిని ప్రతి ఒక్కరు అనుభవించి తీరాలి. ప్రేమ ఇచ్చే ధైర్యం.. ప్రేమ ఇచ్చే కేరింగ్.. జ్ఞాపకాలు.. ఎప్పటికి మర్చిపోలేనివి. అందుకే మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. లేదా మనం ఎవరినైనా ప్రేమిస్తే వారిని ఎప్పటికి మర్చిపోలేము. ప్రేమ అనే రెండు అక్షరాలు జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఓ వ్యక్తిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది.. కాని ఏదైనా అతిగా తీసుకుంటే అది అనర్థమే చేస్తుంది. అందుకే అబ్బాయి.. అమ్మాయిల మధ్య లవ్‌ విషయంలో ఎక్కువ హోప్స్‌ పెట్టుకోకూడదు. ఎలా వెళ్తుందో దానిని అలా వెళ్లనిస్తే చాలా బెటర్‌.. దానిని ఏ మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకున్నా ఆ ప్రేమ అనే రెండు అక్షరాలు పాయిజన్‌గా కూడా మారవచ్చు. అందుకే చాలా మంది ఎక్కువ ప్రేమిస్తారు. సఫర్‌ అవుతారు.. ఒక్కోసారి జీవితాన్నే నాశనం చేసుకుంటారు. ఇవ్వన్ని మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అందుకే లవ్‌ విషయంలో చాలా జాగ్రత్త అవసరం.

Exit mobile version