హైదరాబాద్`నవభూమిబ్యూరో: ఔను మీరు చదివింది నిజమే. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం అనుముల రేవంత్‌రెడ్డి ఒక వేదికను పంచుకోబోతున్నారు. జులై 20`21 తేదీలో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తొలి కమ్మ ప్రపంచ మహాసభ జరగబోతోంది. ఈ మహాసభలో ఏపీ,తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొనబోతున్నారు. పూర్వాశ్రమంలో చంద్రబాబునాయుడు,రేవంత్‌రెడ్డి ఇద్దరూ గురుశిష్యులు. చంద్రబాబు సలహామేరకే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని అప్పట్లో పుకార్లు గుప్పుమన్నాయి. రేవంత్‌రెడ్డి సీఎం అయినప్పుడు, అటు చంద్రబాబునాయుడు సీఎం అయినప్పుడు కేవలం ట్వీట్ల ద్వారా అభినందనలు తెలుపుకోవడమే తప్ప, ప్రత్యక్షంగా కలుసుకోలేదు. రేవంత్‌రెడ్డి ఓ అడుగు ముందుకు వేసి, చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పిలుపు వస్తే హాజరవుతానని, సమన్వయంతో విభజన సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. అయితే రేవంత్‌కు ఆహ్వానం అందకపోవడంతో ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాలేదు.