Tuesday, December 3, 2024
spot_img
Homeజాతీయఆదరణ కోల్పోయిన బీజేపీ

ఆదరణ కోల్పోయిన బీజేపీ

దిగజారుతున్న బీజేపీ ప్రభ 400 సీట్లు వస్తాయన్న దీమాను దెబ్బతీసిన ఉత్తర భారతదేశ ప్రజలు కొత్త చట్టాలతో రైతుల్లో కలవరం జీఎస్టీతో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పెట్రో ధరల పెరుగుదలను తగ్గించని సర్కార్‌

న్యూదిల్లీ`నవభూమిబ్యూరో
పదేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన బీజేపీ ప్రభ ఒక్కసారే దిగజారిందనడానికి ఈ ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం.
ఈ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని ప్రతి సభలో ప్రధాని మోదీ,షాలు ఊదరగొట్టారు. ఫిర్‌ఏక్‌ బార్‌ బీజేపీ సర్కార్‌ అంటూ అంటూ ఉపన్యాసాలు ఇచ్చినా ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రజలు నమ్మలేదు. ప్రతి సభలో బాల రామాలయం గురించి చెబుతూ వచ్చినా దీని ప్రభావం ఎన్నికలపై పడలేదు. అయోధ్యలో బీజేపీ అభ్యర్థి వెనుకబడటంతో ఆలయ నిర్మాణం ప్రభావం పడలేదని అర్థమవుతూనే ఉంది.బీజేపీ ఇంకా మేజిక్‌ సంఖ్య వద్ద దోబూచులాడుతూనే ఉంది. ఈ రాత్రికి పూర్తి ఫలితం వచ్చాక పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంది.
బీజేపీ ప్రభ తగ్గడానికి విశ్లేషకులు పలు కారణాలు చెబుతున్నారు. అందులో కొన్ని..
1.జీఎస్టీ వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం. వీటిని తగ్గించేందుకు ఎలాంటి ప్రయత్నం సర్కార్‌ చేయకపోవడం
2.పెట్రో ధరలు పెరగడంతో ఈ పెరుగుదలకు తనకెలాంటి సంబంధం లేదని,ఆయిల్‌కంపెనీలే నిర్ణయం తీసుకోవాలని మోదీ తప్పుకోవడం. ధరల పెరుగుదలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోవడం.
3.400 సీట్లు గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం వల్ల, దళిత,ఆదివాసీ, మైనార్టీల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరగడం
4.ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని చెప్పడమే కాని,ఉద్యోగాల భర్తీ చేయకపోవడం
5.సర్దార్‌ వల్లబాయి పటేల్‌ విగ్రహానికి 3000 వేల కోట్లు ఖర్చు పెట్టిన మోదీ నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి ఒక్క బహుళార్థక ప్రాజెక్టు చేపట్టకపోవడద
6.వ్యవసాయరంగంలో మూడు నల్లచట్టాలను రద్దు చేయకుండా,దీనిపై ఆందోళన చేస్తున్న రైతులను పట్టించుకోకపోవడం,
7.పార్టీలో సీనియర్లను పట్టించుకోకుండా, సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా విమర్శలకు దారి తీసింది
8.ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడం కోసం వారిపై ఈడీ,సీబీఐ కేసులు పెట్టించడం
9.ఫిరాయింపులను ప్రోత్సహించడం,ప్రభుత్వాలు పడగొట్టి, తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం
10.అగ్నివీర్‌పై వ్యతిరేకత వచ్చినా కొనసాగించడం,రైళ్లల్లో వృద్ధులకు,వికలాంగులకు,జర్నలిస్టులకు కన్సెషన్‌ను రద్దు చేయడం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular