Saturday, November 23, 2024
spot_img
Homeతెలంగాణఓవర్‌లోడ్‌తో లారీల పరుగులు.. అక్రమాలు తేలినా చర్యలుండవు...

ఓవర్‌లోడ్‌తో లారీల పరుగులు.. అక్రమాలు తేలినా చర్యలుండవు…

టీఎస్‌ఎండీసీ, మైనింగ్‌ ప్రేక్షకపాత్ర..సంబంధిత అధికారులూ.. అడవి దారిలోనే వందలాది లారీల ప్రయాణం.. అమలుకు నోచుకోని ఎకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్. జీపీఎస్‌ ట్రాకింగ్‌ చూడరు.. 

 

తూతూమంత్రంగా సీసీ కెమెరాలు
నవభూమి – ములుగు :ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుక రీచ్‌లో రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో డంప్పింగ్ చేస్తున్న అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.. అక్కడి నుంచి రోజుకు 250 నుండి 300 లారీలు ఇసుక తీసుకెళ్తుండగా.. అన్ని లారీల్లోనూ పరిమితికి మించి 20-30శాతం అదనంగా ఇసుక తరలిస్తున్నారు.. నిబంధనల ప్రకారం లారీలను సీజ్‌ చేయడంతోపాటు ఇసుక రీచ్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలి. కానీ.. ఇవేమీ జరగలేదు.
 పోలీసు అధికారులు ఆకస్మిక వాహనలు తనిఖీ చేశారు. ఇసుక లారీలను పరిశీలించగా.. లారీలు ప్రభుత్వం అనుమతించిన ఇసుక కంటే ఎక్కువగా తీసుకెళ్తున్నాయని గుర్తించారు. గత మూడు నెలలో లారీలను సిజ్ చేసిన దాఖానాలు ఉన్నాయి. ఆ రోజు కేసులు నమోదు చేసినా.. కొంత కాలం ఆగినట్లు ఆగి లారీలు యథావిధిగా ఇసుక రవాణా చేస్తూనే ఉన్నాయి.
లారీల్లో ఇసుక లోడ్‌ చేసే ముందు కాంట్రాక్టర్‌ ముందుగా చూడాల్సింది టీఎస్‌ఎండీసీ జారీ చేసే వేబిల్‌. దాని ప్రకారమే లారీలో ఇసుక నింపాలి. కానీ, ఇక్కడ మాత్రం అటువంటివి ఏమి ఉండవు రైజింగ్ కాంట్రాక్టర్ కానుసైగలోనే జరుగుతాయి.. రీచ్‌లలో ఎలాంటి వేబిల్‌ లేకుండానే ఇసుకను పెద్దఎత్తున తరలిస్తున్నారు. ఆ లారీలను రాత్రి వేళలో మాత్రమే బయట పంపిస్తున్నట్లు మండల ప్రజలు గుసగుసలు వినిపిస్తున్న ఆర్టీఏ, పోలీసులు, మైనింగ్‌ అధికారులు ఎవ్వరూ అడ్డుకోవడం లేదు అనే విమర్శలు వెళ్లువేతుతున్నాయి..
నిత్యం వందలాది లారీలు.. వేల టన్నుల ఇసుక.. పరిమితికి మించి తరలుతున్నా అడిగే వాళ్లు లేరు.. అడ్డుకునే వాళ్లు అసలే లేరు.. రీచ్‌ల నుంచి స్టాక్‌ యార్డుల దాకా అంతా దోపిడీనే. విచ్చలవిడిగా నిబంధనల ఉల్లంఘనలే.. అయినా లారీలు సీజ్‌ చేయరు. భారీ జరిమానాలు వేయరు. ఇసుక రీచ్‌ కాంట్రాక్టర్లపై చర్యలే ఉండవు. వే బిల్లులు లేకున్నా లారీల కొద్దీ ఇసుక యథేచ్చగా తరలిపోతోంది. ఇదీ వాజేడు మండలంలోని అయ్యవారిపేట, రాంపురం ఇసుక రీచ్‌ల్లో జరుగుతున్న తతంగం. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన అక్కడికి వెళ్లి తనిఖీ చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఐదు ప్రభుత్వ శాఖలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు, ఇసుక వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. .
ఓవర్‌లోడ్‌తో ఖజానాకు గండి
వాజేడు మండలంలో పరిధిలో 3 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. లక్షలు క్యూబిక్ మీటర్ల ఇసుక మాయం అయిపొయింది. వర్షా కాలం మూడు నెలలు మినహాయిస్తే 9 నెలలపాటు లారీలు ఇసుకను తరలిస్తుంటాయి. ఇసుక రీచ్‌కు వెళ్లే వాహనానికి తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీఎ్‌సఎండీసీ) జారీ చేసే వే బిల్‌ తప్పనిసరి. రీచ్‌ కాంట్రాక్టర్‌ సైతం అందులో పేర్కొన్న విధంగా ఇసుకను కేటాయించాలి. 12 టైర్ల లారీలో 25 టన్నులు, 14 టైర్లకు 32 టన్నులు, 16 టైర్లకు 35 టన్నుల ఇసుక నింపాల్సి ఉండగా… ఓవర్‌లోడ్‌ సాధారణమైపోయింది. వేబిల్‌లో పేర్కొన్న మేరకు టన్నుకు రూ.470 చొప్పున ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అనుమతికి మించి నింపితే టన్నుకు రూ.600-700 వసూలు చేస్తున్నారు. ఇందులో ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు జమ కాదు. ఒక లారీకి ఐదు టన్నుల ఇసుకను అదనంగా వేసినా రూ.3500 నుండి 5000 వరకు కాంట్రాక్టర్‌ జేబులోకే వెళ్తుంది. ఒక రోజులో సరాసరిగా 150 నుండి 200 వాహనాల చొప్పున ఓవర్‌లోడ్‌ వల్ల వచ్చే అక్రమ సంపాదన రూ.3లక్షలపైనే. అక్రమంగా దండుకుంటున్నారు. ఇలా ఒక ఇసుక రీచ్‌ పరిధిలోనే రోజుకు రూ.2లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.
చర్యలకు వెనుకడుగు
 ఇసుక అక్రమ వ్యాపారానికి రీచ్‌లే అడ్డాలు. వేబిల్‌ లేకుండా ఇసుక అమ్ముకోవడం, పరిమితికి మించి లోడ్‌ చేయడం వంటి అక్రమాల వెనుక కీలకపాత్ర రీచ్‌ కాంట్రాక్టర్లదే. నిబంధనలు పాటించని ఇసుక లారీ పట్టుబడితే సంబంధిత రీచ్‌లూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొదటిసారి భారీ జరిమానా విధించి రెండోసారి రీచ్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేసే అధికారం టీఎ్‌సఎండీసీకి ఉంది. కానీ అధికారులు కనీసం రీచ్‌లకు వెళ్లి తనిఖీలు చేయలేకపోతున్నారంటే.. వారి మీద ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. రీచ్‌లలో అక్రమాలు గుర్తించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని, వాహనాల రూట్‌ చేంజ్‌ను గుర్తించేందుకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ అమలు చేస్తున్నామని అధికారులు చెప్పే మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి.
ఇసుక మేత
ఇసుక అక్రమాలు అడ్డుకోవడం, నిబంధనలను పక్కాగా అమలుచేసే బాధ్యత ఐదు ప్రభుత్వ శాఖలపై ఉంది. స్థానికంగా రీచ్‌ల వద్ద అక్రమాలు, అనుమతులు, రూట్‌, ఓవర్‌ లోడ్‌ వంటి ఉల్లంఘనలపై టీఎ్‌సఎండీసీ, మైనింగ్‌, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీస్‌ శాఖలు చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ అక్రమాలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది రాత్రి పగలు భారీ యంత్రలతో ఇసుక తోలుతున్న దాడులు చేసిన దాఖానాలు లెవ్వు..భారీ వాహనాలతో రోడ్లు ఛిద్రమవుతున్నాయంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాల వెనుక ప్రమేయం ఎవరిదీ ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అభయం లేని అరణ్యం
పర్యావరణం
పర్యావరణం, జీవావరణం ఎవరికీ పట్టని పదాలుగా మారిపోయాయి. మానవాళి మనుగడకు అవసరమైన అడవులను,ప్రకృతి సమతుల్యంలో కీలకమైన వన్యప్రాణులను కాపాడుకోవాలనే శ్రద్ధ ఇటు పాలకులకు కానీ అటు ప్రజలకు కానీ పట్టదు. అది కేవలం పర్యావరణ వాదులు, ప్రకృతి ప్రేమికులకు సంబంధించిన విషయంగా మారిపోవడం విశేషం. రాష్ట్రంలోని ఏటూరునాగారం అభయారణ్యం పరిస్థితి చూస్తే ఇది అక్షర సత్యమనిపిస్తుంది. దేశం లోని పురాతనమైన అభయారణ్యాల్లో ఏటూరునాగారం కూడా ఒకటి. 2017 జులై 27 న ఎస్ఓ నంబర్ 2046 (ఇ) ద్వారా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ తో ఈ అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి వచ్చింది. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇసుక లారీలతో వన్యప్రాణులు చెల్లా చెదురు..
ఎకో సెన్సిటివ్ జోన్, వన్యప్రాణుల అభయారణ్యం మధ్య నుంచి వేసిన్ రోడ్ ను163 జాతీయ రహదారిగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్ చత్తీస్ గఢ్ మధ్య వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటికి తోడు వందలాది ఇసుక లారీలు ఈ రహదారి మీదుగానే ప్రయాణం చేస్తున్నాయి. వాజేడు, వెంకటాపురం ప్రాంతం నుంచి భద్రాచలం వైపు, ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల నుంచి మణుగూరు మీదుగా పాల్వంచ వైపు రహదారులు ఉన్నా మణుగూరు, చర్ల ప్రాంతాల నుంచి వచ్చే ఇసుక లారీలను కూడా ఏటూరునాగారం అభయారణ్యం మీదుగా తరలిస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న లారీలపై ఎటువంటి నియంత్రణ లేక పోవడంతో హారన్ ల శబ్థాలకు వన్యప్రాణులు చెల్లా చెదురై పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో లారీల కింద పడి చనిపోతున్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ లో ఇసుక తవ్వకాలను అనుమతి ఉంట్టుందా. అడవి శాఖ అధికారులు పర్మిషన్ ఇవ్వొచ్చా అనేది ప్రజలలో అనుమానాలు తేలేతుత్తున్నాయి.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular