సజ్జలపై క్రిమినల్ కేసు
అమరావతి`నవభూమి: కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో చేసిన వ్యాఖ్యలకు వైసీపీ అగ్రనేత,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడారని టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు సజ్జలపై 153,505,125 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ అధికారి
రంగారెడ్డి`నవభూమిబ్యూరో: రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సీలాల్,ఏఈలు కార్తీక్,నిఖేశ్‌లను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసిన మరొకరు తప్పించుకున్నారు. నాలుగు గంటలు శ్రమించి ఆ వ్యక్తిని కూడా పట్టుకొని నలుగురిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై`నవభూమిబ్యూరో: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఆరంభంలోనే భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఆసియా మార్కెట్లోని సానుకూలతలు మనకు దన్నుగా నిలిచాయి.గత కొద్ది రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ ఒక్కసారే లాభాల్లోకి దూసుకెళ్లింది. సన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 74.410 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22.619 వద్ద కొనసాగుతోంది.
ఏబీపీని సర్వీసులోకి తీసుకోవాలి: ఏపీ సీఎస్ ఆదేశాలు
అమరావతి`నవభూమి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఏపీ సర్కార్ సస్పెన్షన్‌ను క్యాట్ ఎత్తివేయడంతో ఆయన్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ,స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా పోస్టింగ్ లభించింది. అయితే ఆయన శుక్రవారంనాడే పదవీ స్వీకారం చేయడం సాయంత్రం పదవీవిరమణ చేయడం జరుగుతుంది.
బిగ్‌బాస్`8లో కంటెస్టంట్లు వీళ్లే!
హైదరాబాద్`నవభూమిబ్యూరో: మళ్లీ బిగ్‌బాస్ సీజన్ 8 మొదలవ్వబోతుందనే సంకేతాలు వెలుబడుతున్నాయి. ఈ సీజన్‌లో కంటెస్టంట్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో అంజలి పవన్(యాంకర్),వింధ్య విశాఖ(యాంకర్),నయని పావని(యూట్యూబర్),కిరాక్ ఆర్పీ (జబర్జస్త్),రీతూ చౌదరి(యాంకర్),అమృతా ప్రణయ్(మిర్యాలగూడలో పరువుహత్యకు సంబంధించిన యువతి),నిఖిల్(యాంకర్,స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ,బర్రెలక్క,అనీల్ గీలా(యూట్యూబర్),బుల్లెట్ బాస్కర్(జబర్దస్త్),సోనియా సింగ్(సినీనటి),బంచిక్ బబ్లూ(య్యూట్యూబర్),కుషితా కల్లపు(హీరోయిన్),వంశీ(యూట్యూబర్),సుప్రీత(నటి సురేఖా వాణి కుమార్తె)