మిర్యాలగూడ, మే 30:-(నవ భూమి ప్రతినిధి) నల్లగొండ జిల్లా నిడమానూరు మండలంలో అసైన్డ్ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై ముగ్గురు తహసీల్దార్లలో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేయగా గురువారం ఈ కేసుకు సంబంధించిన అప్పటి విఆర్ఓ ముదిగొండ సుమన్, గ్రామస్తులు మార్తీ సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ లను అరెస్టు చేసి మిర్యాలగూడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అపూర్వరవళి ముందు హాజరు పరిచారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలిచ్చారు. సుమారు ఐదెకరాల అసైన్డ్ భూమిని ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేశారని అదే గ్రామానికి చెందిన మార్తి వెంకట్ రెడ్డి విజిలెన్స్ అధికారులకు, జిల్లా కలెక్టర్ కు 2023లో ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అండతో దర్యాప్తు జరగలేదు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, హై కోర్టు ఆదేశాలతో పోలీసుల్లో కదలిక వచ్చింది. ఇద్దరు తహసీల్దార్లను బుధవారం మిర్యాలగూడ కోర్టు లో హాజరు పరిచారు, మరొక తహసీల్దార్ పరారీలో ఉన్నారు. ఇంకా కొంత మంది అరెస్టు కానున్నట్టు తెలిసింది.
Report: Khaja Hameedoddin News Reporter,Navabhoomi Miryalaguda