బడంగ్ పేట-నవభూమి:వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరగడానికి. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి విద్యార్థుల్లో ఉన్నటువంటి మొబైల్ టీవీ కంప్యూటర్ అడిక్షన్ నుంచి విద్యార్థులను కాపాడటానికి బాలల వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణా తరగతులు. బడంగ్ పేట మరియు కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ లో జూన్ ఒకటో తారీకు నుంచి పదో తారీకు వరకు గురు నిలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం 6:00 నుంచి 8 గంటల వరకు శిక్షణ అందజేయడం జరుగుతున్నది. ఈ శిక్షణ యొక్క బ్రోచర్ బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి తమ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. యోగ ద్వారా మానసిక ప్రశాంతత సిద్ధించడమే కాకుండా శరీరము బలంగా దృఢంగా తయారవుతుందని 10 సంవత్సరాల క్రితం తాను నేర్చుకొని యోగ సాధన ద్వారా ప్రయోజనాన్ని పొందాను అని తెలిపారు. ఈ వేసవి సెలవుల్లో చిన్నారులు ఈ శిక్షణలో పాల్గొనడం ద్వారా వారిలో మానసిక వికాసం బాగా జరుగుతుందని తెలిపారు. శ్రీ ఇస్మాయిల్ గురూజీ మాట్లాడుతూ ధ్యానము ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు విద్యార్థులకు నేర్పించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొందాల్సిన వారు 9603256572 నెంబర్ను సంప్రదించమని కోరారుబడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి శ్రీ స్వధర్మయోగి శ్రీ ఇస్మాయిల్ గురూజీ బోతపులి భాగ్యరాజు దుగ్యాల నరేంద్రరావు గురూజీ గట్టు బాలకృష్ణ గిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.