Tuesday, December 3, 2024
spot_img
Homeజాతీయప్రధాని పీఠం వైపు బాబు చూపు

ప్రధాని పీఠం వైపు బాబు చూపు

న్యూదిల్లీ`నవభూమిబ్యూరో
దేశ రాజకీయ క్షేత్రంలో సంకటస్థితి ఏర్పడిన తరుణంలో యావత్తు నేతలు దక్షిణాది నేతలు,ముఖ్యంగా తెలుగురాష్ట్రాల వైపు దృష్టి సారిస్తారని నానుడి. ఇది అనేక సార్లు అనేక సంకట స్థితిలో తెలుగువాడైన ఎన్టీఆర్‌, ఆ తర్వాత నారా చంద్రబాబునాయుడు దేశ రాజకీయాలకు దిక్చూచీగా మారారన్న చరిత్ర చర్విత చరణం.
మళ్లీ ఇలాంటి పరిస్థితి దేశ రాజకీయ ఆవరణంలో ఆవిర్భవించబోతోందా.. ఉత్తరాది పరిస్థితిలు ఔననే చెబుతున్నాయి. అనేక రాజకీయ విశ్లేషకులు, జ్యోతిష్యులు సైతం నాటి పరిస్థితులు దాపురించబోతున్నాయని చెప్పకనే చెబుతున్నారు.
ఎన్నికల ఘట్టం దాదాపు పూర్తయ్యింది. ఈవీఎం మెషీన్లలలో అభ్యర్థుల భవితవ్యంతో పాటు ప్రధాన పార్టీల ప్రధాని అభ్యర్థుల జాతకాలు నిక్షిప్తమై ఉన్నాయి.
అందరూ అనుకున్నట్లుగా కాక ఈ సారి అందరి జాతకాలు తారుమారు కానున్నాయి(ట).
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోదీ తప్పకుండా విజయం సాధిస్తారని సర్వేలన్నీ కోడై కూశాయి. ఆయన పడిన కష్టం అలాంటిది. ఊరంతా ఒక దారైతే ఉలిపిరికట్టెది మరో దారి అన్నట్లు.. సోషల్‌ మీడియా మంత్రజాలాన్ని యుపీ,బీహార్‌లాంటి పెద్ద రాష్ట్రాల్లో గ్రామీణులు ఒంట పట్టించుకోలేక పోయారు. వారి కండ్ల ముందు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల,డీజిల్‌,పెట్రోల్‌ ధరలు ఆకాశాన్నంటడం సాక్షాత్కరించిన తర్వాత నోట్లోకి ఐదు వేళ్లు వెళ్లలేక,కఠినం వాస్తవాలను జీర్ణించుకోలేకపోయారు. దాంతో వారు మోదీషాలకు హ్యాట్రిక్‌ ఇవ్వకూడదని గట్టిగా తీర్మాణించుకున్నారు. ఇక పంజాబ్‌,హరియానా ంౖతులతో పాటు కేజ్రీవాల్‌ను జైల్లో తోసిన పాపానికి దిల్లీ ప్రజ కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. ఇక అయోధ్య గుడి నిర్మాణం,ముస్లిం రిజర్వేషన్ల రద్దు,పిఓకే స్వాధీనత ఇవన్నీ గ్రామీణప్రజలను ఆకట్టుకోలేకపోయాయి.అంటే ప్రభావితం చేయలేకపోయాయి. ఫలితంగా 400 సీట్లకు సగానికి సగం తగ్గిపోతున్నట్లు విశ్లేషకుల అంచనా. మేజిక్‌ ఫిగర్‌ 277 సీట్లు. మరి 200 వస్తే ఎలా? అందుకే మోదీషా ద్వయం విపరీతంగా ఆలోచించి,ఎన్నికల ఫలితాలు రాగానే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబునాయుడిని ఎన్డీఏ కన్వీనర్‌గా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీలో చంద్రబాబు,ఎన్డీఏ కూటమి గెలిచినా, ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినా ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీఏ గట్టెక్కాలంటే చంద్రబాబు అనే మంత్రదండం మోదీషాకు అత్యంత అవసరం. అందుకే ఎన్డీఏ కన్వీనర్‌ పదవిని దారబోసేందుకు మోదీషా సిద్ధమైనట్లు దిల్లీ నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మోదీషా దారి ఒకటైతే..చంద్రబాబునాయుడిగా రి దారి మరొకటి. బాబుగారు ఏకంగా ప్రధాని పదవికే ఎసరు పెట్టేశారు. ప్రస్తుత పరిస్థితిని ముందే చంద్రబాబు ముందే గ్రహించినట్లే ఉన్నారు. అందుకే ఏపీలో ఒక్క శాతం ఓటు బ్యాంకు లేని బీజేపీతో పొత్తుకు తహతహలాడారు. పొత్తులేదని నేతలు థిక్కారస్వరం వినిపించినా,బాబు పట్టువిడవ లేదు. మొత్తానికి మోదీషాలను మెప్పించి, ఒప్పించి పొత్తు కుదుర్చుకున్నారు.
సరే ఎన్నికల తంతు పూర్తయింది. ఇక ఫలితాలే తరువాయి. ఈ దశలో బాబు చక్రం తిప్పడం మొదలు పెట్టారు. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోతే అన్ని పార్టీలు చంద్రబాబు వైపు తప్పనిసరిగా చూస్తాయి. అంతేకాక మమతా బెనర్టీ, లాలూ, ఫరూక్‌ అబ్దుల్లా, శరద్‌పవార్‌ లాంటి వాళ్లు చంద్రబాబును సమర్థిస్తారు కూడా.వీరందరినీ ఒక గాటిన కట్టి చంద్రబాబు ప్రధాని పీఠం ఎక్కొచ్చు.
మరి రాష్ట్రాన్ని పుత్రరత్నం చేతిలో పెట్టేందుకు రంగం కూడా సిద్ధం అవుతుంది.
నిజానికి బీజేపీకి 200 మించి సీట్లు రాకపోతే ఎన్డీఏ మిత్రపక్షాలు జారుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే బాబుకు ఫ్లస్‌పాయింట్‌. ఎందుకంటే మిత్రపక్షాలు జారుకుంటే ఎన్డీఏలో లుకలుకలు రావడం,మోదీని విభేదించడం తప్పనిసరి. ఈ పరిస్థితిలో బాబు ఎన్డీఏ కన్వీనర్‌గా వస్తే,ప్రధాని పీఠం దక్కించుకుంటాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కొసమెరుపు ఏమిటంటే..చంద్రబాబుకు ప్రధాని పీఠాన్నెక్కే ఛాన్స్‌ ఉందని గ్రహించిన వ్యక్తి ఆయన శిష్యుడు కేసీఆర్‌ మాత్రమే. బాబు ఆలోచల్ని పంచుకోగలిగిన కేసీఆర్‌,చంద్రబాబు ప్రయత్నాన్ని ముందే గ్రహించారు. అందుకే ప్రధాని రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular