Site icon Navabhoomi Telugu News

హీరో ఎంట్రీతో ఆగిన భూమిక విడాకులు..

bhoomika diverce?

హైదరాబాద్‌`నవభూమిబ్యూరో:అమ్మాయే సన్నగా..అర నవ్వే నవ్వగా..అన్న పాట ఇప్పటికీ యూత్‌ పెదాలపై నర్తిస్తూనే ఉంటుంది. 2001లో రిలీజైన ఖుషీ సినిమాకు 23 ఏళ్లు దాటినా యూత్‌ ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు, బాక్సాఫీసు బద్ధలు కొట్టిన ఖుషీ సినిమాలో హీరోగా పవన్‌కళ్యాణ్‌,హీరోయిన్‌గా భూమిక కేరీర్‌నే మలుపులు తిప్పింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించిన భూమిక అవకాశాలు తగ్గి అక్కగానో..అమ్మగానో కేరక్టర్‌ ఆర్టిస్టుగా ఒదిగిపోయింది. ఈ లోగా భరత్‌ఠాకూర్‌ అనే యోగా మాస్టర్‌ను పెళ్లాడి..ఓ పిల్లాడికి తల్లయ్యింది. అది సరే ఇప్పుడు భరత్‌ ఠాకూర్‌తో ఎప్పటి నుంచో విభేదాలు మొదలయ్యాయి. సినీ పెద్దలు జోక్యం చేసుకొని, ఇద్దరికీ సర్ధుబాటు చేస్తూనే ఉన్నారు. భరత్‌ ఠాకూర్‌ కొన్నాళ్లు మాయాబజార్‌ అనే సినీపత్రిక నడిపారు. కొన్ని వ్యాపారాలు చేసి దారుణంగా నష్టపోయారు. ఆ అప్పుల్ని తీర్చేందుకు భూమిక శ్రమించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు..విడాకుల దాకా వెళ్లడం..సినీ పెద్దల జోక్యంతో రాజీ పడటం జరుగుతోంది.తాజాగా మళ్లీ ఇద్దరి మధ్య కీచులాటలు మొదలవ్వడంతో భూమిక విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు టాలీవుడ్‌ వీధుల్లో వార్త కోడై కూస్తోంది. భూమికతో స్నేహమంటే ఇదేరా చిత్రంలో నటించిన స్టార్‌ హీరో నాగార్జున ఈ వ్యవహారం తెలిసి,వెంటనే జోక్యం చేసుకొని భార్యాభర్తలకు నచ్చజెప్పాడట. ప్రస్తుతానికి నాగ్‌ కాస్త కటువుగానే చెప్పడంతో భరత్‌ ఠాకూర్‌ తగ్గిపోయాటని సినీ ఇండస్ట్రీలో టాక్‌!

Exit mobile version