అశ్వాపురం మే 28 నవభూమి: సేవరత్న నేషనల్ అవార్డు 2024 సంవత్సరమునకు గాను ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ జనరల్ సెక్రెటరీ గుర్రం శ్రీనివాస్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు. ఈ అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రత్యేక ప్రజా ఉద్యమకారులకు సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు, స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించి బహుజన రైటర్స్ నాలుగోవ వెస్టర్న్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా సేవరత్న నేషనల్ అవార్డును గుర్రం శ్రీనివాస్ కు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఇండియాలోని ఐదు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా, రాష్ట్రాల నుండి సుమారుగా 500 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కు హాజరవుతారని తెలియజేశారు. ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్, రాష్ట్ర కోఆర్డినేటర్ అనుమండ్ల విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ ఎం సంజీవరావు తదితరులు పాల్గొన్నారు
సేవ రత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన గుర్రం శ్రీనివాస్
2024వ సంవత్సర ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ జనరల్ సెక్రెటరీ గుర్రం
RELATED ARTICLES