Site icon Navabhoomi Telugu News

సినీనటుడు అలీ వైసీపీకి రాజీనామా

హైదరాబాద్‌`నవభూమిబ్యూరో: ప్రముఖ హాస్యనటుడు,వైసీపీనేత,ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు ఆలీ వైసీపీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామాలేఖను పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు పంపారు. గత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలవ్వడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆలీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. పార్టీ ఓటమి పాలవ్వడంతో రాజీనామాను ప్రకటించారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో ఉన్న ఆలీ,వైసీపీలో చేరారు. ఆలీకి మంత్రి పదవి లేదా,రాజ్యసభ సీటు లేదా మైనార్టీ కార్పొరేషన్‌ పదవి వస్తుందని అంతా భావించారు. కానీ అప్పటి సీఎం ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు పదవిలో నియమించారు. వైసీపీ పార్టీ ఓటమి తర్వాత ఆలీ పార్టీకి,పదవికి రాజీనామా చేస్తారని అంతా భావించారు. మరో పక్క ఆలీకి అత్యంత ప్రియమిత్రుడైన పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి లభించడంతో తిరిగి ఆయన పంచన చేరుతారని అంతా భావించారు.

Exit mobile version