జూలూరుపాడు, మార్చి 26 ( నవ భూమి ప్రతినిధి)
మండలం పరిధిలోని కాకర్ల గ్రామంలో వేం చేసిన శ్రీ రుక్మిణి సహిత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి కల్యాణ మహోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణ సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు.ఆలయ కమిటీ చైర్మన్ అల్లాడి నరసింహారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం అన్న దానం చేశారు.ఈ కార్య క్రమంలో ఎంపీటీసీ దుద్దుకురి మధుసూదన్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ వందనపు సత్యనారాయణ,పుల్లారావు,ఎల్లంకి చిన్న నాగేశ్వరావు,ఢిల్లీ వెంకటేశ్వర్లు,అల్లాడి లింగారావు,చెరుకుమల్లి కృష్ణయ్య,చావా వెంకట రామారావు,లింగాచారి,మిరియాల కిరణ్ కుమార్ పాల్గొన్నారు.