జూలూరుపాడు, జూన్ 27 (నవ భూమి ప్రతినిధి)
భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) సీనియర్ నాయకులు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింత స్వరాజ్యరావు తీవ్ర అనారోగ్య సమస్య తో బుధ వారం మరణించారు.సమాచారం అందుకున్న సి పి ఐ పార్టీ శ్రేణులు,పలు రాజకీయ పార్టీల నాయకులు ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పార్టీ ఆదేశం మేరకు పార్టీ అభివృద్ధి,నిర్మాణం కోసం రెండు దశాబ్దాల క్రితం జూలురుపాడు లో స్థిర పడ్డారు.
సి పి ఐ పార్టీ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు వారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ నిర్మాణం కోసం నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం బలమైన పోరాటాలు నిర్వహించారని వారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటించారు.
సిపిఐ పార్టీ ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు పోటు ప్రసాద్,సాబీర్ పాషా మాట్లాడుతూ తన తుది శ్వాస వరకు ఎర్రజెండా తోనే పయనం కొనసాగించారని అనేక ఇబ్బందులు వచ్చిన నిరంతరం ప్రజా ఉద్యమాలలోనే ప్రజల పక్షానే ఉన్నారని పార్టీ సిద్ధాంతాల పట్ల నిజాయితీ గల రాజకీయాలు నిర్వర్తించారని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని వారి మరణం సి పి ఐ పార్టీ కి తీరని లోటని పేర్కొన్నారు.ఆయనకు నివాళులర్పించిన వారిలో సిపిఐ వైరాడివిజన్ కార్యదర్శి ఎర్ర బాబు,సిపిఐ రైతు సంఘం జిల్లా నాయకులు ఏపూరి బ్రహ్మం,ముత్యాల విశ్వనాథం, చండ్ర నరేంద్ర కుమార్,నాగుల్ మీరా,నరాటి ప్రసాద్,రావులపల్లి రవికుమార్,చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు,వాసిరెడ్డి మురళి,చారుగుండ్ల నాగయ్య,గుండె పిన్ని వెంకటేశ్వర్లు,చాంద్ పాషా, ఎల్లంకి మధు,గుడిమెట్ల సీతయ్య,కిలారి ముత్యాలు తదితరులు నివాళులర్పించారు.
Report: Adam,julurupadu reporter,Navabhoomi Daily