వయనాడ్‌లో ప్రకృతి బీభత్సవానికి కరిగి,కదిలిపోని వారుండరు. మొట్టమొదట స్పందించిన మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్ తన ట్రస్టు తరఫున మూడు కోట్లు ప్రకటించి,అందరికీ ఆదర్శంగా నిలిచారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి,ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిపి కోటిరూపాయల విరాళాన్ని కేరళ సీఎం సహాయ నిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వయనాడ్ విషాదం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. బాధితులు త్వరగా కోలుకోవాలని ఎక్స్ పోస్టులో రాశారు. ఇక అల్లు అర్జున్ పాతిక లక్షలు,సూర్య,జ్యోతిక,కార్తీ సంయుక్తంగా యాభైలక్షలు,నయనతార`విఘ్నేష్ 20 లక్షలు,ముమ్ముటి,దుల్హర్ సుల్తాన్ రూ,35లక్షలు,కమల్‌హాసన్ పాతికలక్షలు,విక్రమ్ రూ.20లక్షలు,రష్మిక రూ.10లక్షల విరాళం ప్రకటించారు. వెల్లువలా విరాళాలు వస్తూనే ఉన్నాయి.