Site icon Navabhoomi Telugu News

ప్రమాదాలు నివారించకుండా ప్రజాప్రతినిధులపై విమర్శలా ? 

చొప్పదండి జూన్ 2(నవ భూమి):  గత సంవత్సర కాలంగా చొప్పదండిలో సెంట్రల్ లైటింగ్ పనులలో జాప్యం కారణంగా జరుగుతున్న  ప్రమాదాలు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రమాదాలు నివారించమని కోరుతున్న ప్రజాప్రతినిధులపై మున్సిపల్ కౌన్సిలర్ ద్వారా కమిషనర్ , చైర్మన్ ప్రకటనలు ఇప్పించడం  విడ్డూరంగా ఉందని ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి దుయ్యబట్టారు. గుమ్లాపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్లాపూర్ ఎంపీటీసీ బత్తుల లక్ష్మీనారాయణ తో కలసి ఆయన మాట్లాడుతూ
గత రెండు సంవత్సరాలుగా 33 కోట్ల అప్పుతో పట్టణ సుందరీకరణ పేరుమీద జరుగుతున్న పనులు ఎందుకు  పూర్తి కావడం లేదో మున్సిపల్ కమిషనర్ వివరించాలని
ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు.రాష్ట్ర రహదారిపై ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతుంటే మున్సిపల్ కమిషనర్,
ఏ ఒక్కరోజు సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేయలేదని కనీసం తామైనా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రమాద సూచికలు రేడియం లైట్లు ప్లాస్టిక్ డివైడర్లు ఏర్పాటు చేసిన పాపాన పోలేదని
విమర్శించారు.
 ఇవాళ వాహనదారులు ప్రమాదానికి గురవుతుంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టంజరుగుతుంటే వాహన దారులు వికలాంగులుగా మారుతుంటే ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులపై విమర్శలు చేయించడం ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
మున్సిపల్ కమిషనర్ ఇప్పటికైనా రాజకీయ నాయకుల ద్వారా ప్రకటనలు ఇప్పించడం మాని ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోతే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ విలాససాగరం అంజయ్య, బద్దెనపల్లి రాజేందర్, రామడుగు ప్రశాంత్, మహేష్, కంకణాల సంతోష్ కుమార్, కోస్న సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version