Site icon Navabhoomi Telugu News

పెద్ద మాఫియానే ఉంది.. అన్ని ఆధారాలు సీరియల్‌గా బయటపెడ్తాం’

తెలంగాణ ప్రభుత్వ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వెనుక పెద్ద మాఫియానే ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలన్ని తమ దగ్గరున్నాయని.. వాటిని సీరియల్‌గా బయటపెడతామని పేర్కొన్నారు. ధరణి పేరుతో సీఎం కేసీఆర్‌ కుటుంబం భూములన్నీ దోచుకుంటోందన్నారు. రాష్ట్రంలో రాత్రిపూట కూడా ధరణీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని రేవంత్ ఆక్షేపించారు. తెలంగాణలోని ప్రజల ఆస్తులు, భూములు, పర్సనల్ డేటా మొత్తం విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయని రేవంత్ ఆరోపించారు.

Exit mobile version