నిత్యం సేవా కార్యక్రమాలలో తనమునకలవుతూ తనను తాను తీర్చిదిద్దుకున్న మహా శిల్పి డా. కుసుమ భోగరాజు
Azeed Shaik
కుసుమ భోగరాజు అంటే ఒక సేవ ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం, ఒక స్నేహ పరిమళం ఒక మధురమైన మానవతా దృక్పథం. కుసుమ భోగరాజు గారు ఆదర్శ ఫౌండేషన్ ద్వారా వందలాది వైద్య శిబిరాలు నిర్వహించారు. నిరుపేదలను దీనులను అనాధలను చేరదీసి వారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతే కాకుండా మరి ఎంతోమందికి ఆసుపత్రులలో వైద్య చికిత్స అందించడం ద్వారా స్వయంగా ఆదుకున్నారు తద్వారా ఒక గణనీయమైన. సేవ మార్గాన్ని ఆయన అనుసరించారు. అందుకే శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, మోహన్ ట్రస్ట్ వంటి నగరంలో ప్రముఖంగా పేరు ఉన్న సేవా సంస్థలు తమ సాంస్కృతిక సేవా కార్యక్రమాల సమయంలో ఖచ్చితంగా భోగరాజును తమ అతిథిగా ఆహ్వానిస్తుంటారు. ఎంతోమంది కవులు కళాకారుడు వాయిద్య బృందాల వారు సేవా సంస్థలు అన్నింటినీ కలుపుకుపోయే విశాల దృక్పథం కలిగిన మహనీయుడు ఆయన తన తల్లి పేరిట ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఆ పేరు మీదుగా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య రంగం వైద్యరంగం అది ఇది అనే తేడా లేకుండా కుదిరిన రంగంలో ఎక్కువ మందికి సహాయం చేసిన కుసుమ భోగరాజు, నగరంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు దశాబ్దాలుగా చేస్తున్న నో టుబాకో డే, నో టొబాకో మంత్ వంటి క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలలోనూ, ప్రభుత్వ బాలికల వసతి గృహాలలో దంత ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు మొదలైన ప్రజాహిత కార్యక్రమాల నిర్వహణ లో డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు కు కుడి భుజంగా కుసుమ భోగరాజు అండగా ఉండడం నిజంగా ప్రశంసనీయం. ఎందుకు ఆయన ఆదర్శ ఫౌండేషన్ ద్వారా వ్యక్తిగతంగాను మరికొన్ని సంస్థలతో కలిసి నిరాటంకంగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు. అందుకే వైవి సుబ్బారావు, డాక్టర్ జేబీ రాజు గారు లాంటి పెద్దలు మన కుసుమ భోగరాజు ఉంటే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ప్రశంసిస్తూ ఉంటారు. ఇటువంటి మహనీయులంతా కుసుమ భోగరాజులోని నిబద్ధత క్రమశిక్షణ అంకితభావాలకు ఇప్పుడు ఫిదా అయిపోయారు. మల్లె పువ్వు లాంటి స్వచ్ఛమైన పరిమళం కలిగిన మనసున్న మంచి మనిషి మన కుసుమ భోగరాజు గారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆమని గారు వారి నిర్వహించే ప్రతి కార్యక్రమంలో నేను కనబడితే మొదటగా నాపై వేసే ప్రశ్న అయ్యా కుసుమ భోగరాజు అన్నయ కనబడ్డారా? అవును తల్లి కనపడ్డారు ఆయన ఎప్పుడూ గంట ముందే వేదికపోయిన కనపడ్డారని చెప్పడం నాకు అలవాటు అయిన సమాధానం. అంత క్రమశిక్షణ అంత అంకితభావం ఎవరి కార్యక్రమం అయినా తనదే అన్నంతగా ఆలోచించి ఆ కార్యక్రమాల విజయం కోసం నిరంతరం తపిస్తూ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఒక పెద్ద అన్నయ్యల బాధ్యత తీసుకుని అందరి మన్ననలు ప్రశంసలు పొందుతున్నారు. వేదికపై కుసుమ భోగరాజు గారు ఉన్నారంటే ఆ కార్యక్రమం సూపర్ సక్సెస్ అని మేము భావిస్తూ ఉంటాం. కళా పత్రిక ఎడిటర్ డాక్టర్ రఫి, త్రినాధ రావు గారు వంటి చైతన్య సేవలందిస్తున్న పెద్దలు అందరికీ ఆయన అత్యంత ఆత్మీయుడు అనుసరణీయుడు అనుగ్రహ పాత్రుడు. ఆ విధంగా డా. కుసుమ భోగరాజు పాత్ర కల్చరల్ ప్రోగ్రామ్స్ లో విస్మరించలేనిది. అమేయమైన అమోఘమైన ఆయన సేవలు వెలకట్టలేనివి. నేను రాజకీయాలలో లేడు వ్యాపారవేత్త కాదు అత్యంత సామాన్యుడు కానీ ఒక కఠిన తరమైన బాటలో వెళుతూ ఎందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. మనలో సేవాగుణం ఉందంటే అది నాయకత్వ లక్షణంగా పేర్కోవాలి. సేవా గుణాన్ని జీవన ధ్యేయంగా అలవర్చుకుని అందులో నిష్టగా పటిష్టంగా కొనసాగాలని దీక్ష తీసుకున్నంతగా సేవా కార్యక్రమాలలో తనమునకలవుతూ తనను తానే మహోన్నత శిల్పంగా తీర్చిదిద్దుకున్న మహా శిల్పి డా. కుసుమ భోగరాజు. నా దృష్టిలో ఆయన ఒక సేవకుడే కాదు, గొప్ప నాయకుడు కూడా అని నా ప్రగడ విశ్వాసం. నా తరఫున డా. కుసుమ భోగరాజు గారికి అభివందన చందన చంపకమాలలు సవినయంగా అర్పిస్తున్న సహృదయ మిత్రుడు.