Site icon Navabhoomi Telugu News

చొప్పదండి పట్టణంలో కుంటు పడిన అభివృద్ది…

చొప్పదండి,జూన్13(నవ భూమి):చొప్పదండి పట్టణం లో గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హయాం లో చక చకా సాగిన అభివృద్ది పనులు ఇప్పుడు ఎక్కడికి అక్కడే నిలిచిపోయి అభివృద్ది కుంటు పడిందని బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సీ సెల్ పట్టణ అధ్యక్షుడు మావురపు మహేష్ విమర్శించారు.గురువారం ఆయన మాట్లాడుతూ
పట్టణం లో ఫైర్ స్టేషన్,వైకుంఠ దామం,సెంట్రల్ లైటింగ్ పనులు నిలిచి పోయాయి అని అన్నారు.ఏడు నెలలు గడుస్తున్నా పట్టణం లో ఒక్క అభివృద్ది పని కూడా ముందుకు సాగడం లేదని, కొత్త అభివ్రుది పనులు కూడా ఏమీ మొదలు పెట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.సెంట్రల్ లైటింగ్ పనులలో జాప్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని పేర్కొన్నారు.
Exit mobile version