శేరిలింగంపల్లి-నవభూమి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూకట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే ఉత్సవాలకు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా 3వ అడిషనల్ జిల్లా జడ్జ్ బి.తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ గావించారు. ప్రశాంత్ నగర్ లోని కోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద బార్ అసోసియేషన్ కూకట్ పల్లి కోర్ట్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో 6వ ఎడిజె పావని, కోర్ట్స్ కాంప్లెక్స్ లోని ఇతర జడ్జీలు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి పెద్ద, ప్రధాన కార్యదర్శి తాండ్ర రమేష్, కార్యవర్గ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.